బీహార్‌లోని బంకా జిల్లాలోని అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుమ్రామా గ్రామంలో తీవ్ర కలకలం రేపిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

బీహార్‌లోని బంకా జిల్లాలోని అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుమ్రామా గ్రామంలో తీవ్ర కలకలం రేపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన అన్నయ్య భార్యతో పారిపోయాడు. పోలీసు నివేదికల ప్రకారం, గుజరాత్‌(Gujarat)లో కూలీగా పనిచేస్తున్న అన్నయ్య, ఇటీవల తన తమ్ముడికి ఫోన్‌ చేసి తన భార్యను ఆమె తల్లి ఇంటి నుంచి తిరిగి తీసుకురావాలని కోరాడు. తమ్ముడు తన వదిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి రాత్రి బస చేశాడు. అయితే, మరుసటి రోజు ఆమెతో ఇంటికి తిరిగి రావడానికి బదులుగా, ఇద్దరూ అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు వారి కోసం తీవ్రంగా వెతికినా కానీ ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఈ కేసుపై మాట్లాడుతూ, అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ పంకజ్ కుమార్ ఝా "మేము సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఇద్దరి ఆచూకీని కనుక్కొనేందుకు గాలింపు చర్యలు చేపట్టామని దొరికిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ehatv

ehatv

Next Story