No Confidence Motion : లోక్ సభలో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన మజ్లిస్
లోక్ సభలో(Loak Sabha) భారత రాష్ట్ర సమితి(BRS) కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని(motion of no confidence) ప్రవేశపెట్టింది. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు నోటీసులు ఇచ్చారు.

No Confidence Motion
లోక్ సభలో(Loak Sabha) భారత రాష్ట్ర సమితి(BRS) కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని(motion of no confidence) ప్రవేశపెట్టింది. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు నోటీసులు ఇచ్చారు. ఆ అవిశ్వాస తీర్మానాన్ని బిజినెస్ లిస్టులో చేర్చాలని కోరారు.
లోక్‌సభలో రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్‌లోని 17వ అధ్యాయంలోని రూల్ 198 (బి) కింద, ఈ క్రింది తీర్మానాన్ని సభలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నోటీసు ఇచ్చింది. ఇవాళ సవరించిన బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా ఆ పార్టీ కోరింది.
దీనికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లమీన్ [ఏఐఎంఐఎం] పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిపై ఏఐఎంఐఎం అధినేత, లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు.
