మూసివేసిన పాత ఇనుప దుకాణాన్ని తిరిగి తెరిచేందుకు లంచం(Bribe) తీసుకోవడమే కాకుండా మరింత కావాలని జీఎస్టీ అధికారులు(GST Officers) డిమాండ్ చేశారు.

మూసివేసిన పాత ఇనుప దుకాణాన్ని తిరిగి తెరిచేందుకు లంచం(Bribe) తీసుకోవడమే కాకుండా మరింత కావాలని జీఎస్టీ అధికారులు(GST Officers) డిమాండ్ చేశారు. పన్నుల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని... జరిమానా విధించకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని జీఎస్టీ సూపరింటెండెంట్ వి.డి. ఆనందకుమార్(PD Anand Kumar), ఇన్స్పెక్టర్ మనీష్ శర్మ(Inspector manish Sharma) అడిగారని గ్రేడ్ వన్ ఐరన్ స్క్రాప్ మర్చంట్స్‌కు చెందిన సయ్యద్ ఫిరోజ్ 2023, అక్టోబరు 4న ఫిర్యాదుచేశారు. అంతకు మూడు నెలల ముందు జులై 4వ తేదీన వారు తమ దుకాణంలో సోదాలు నిర్వహించి జప్తు చేశారని, రూ.25 లక్షలు జరిమానా విధిస్తామన్నారని పేర్కొన్నారు.. రూ.10 లక్షలు లంచం ఇస్తే జరిమానా రద్దు చేస్తామని కూడా చెప్పారని, తాను బతిమాలడంతో చివరకు రూ.5 లక్షలకు ఒప్పుకున్నారని ఫిరోజ్ తెలిపారు. ఈ డబ్బును అదే రోజు సాయంత్రం ఒక హోటల్లో అందజేశానన్నారు. ఆ తర్వాత మరో రూ.3 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఫిరోజ్ పేర్కొన్నారు.అదనపు లంచం ఇచ్చేందుకు తాము నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందన్నారు. దీనిపై జీఎస్టీ అధికారులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో తనను అరెస్టు చేశారని ఫిరోజ్ పేర్కొన్నారు. ఈ విషయాలను వివరిస్తూ 2023 అక్టోబరు 4వ తేదీన ఫిరోజ్ సీబీఐ అధికారులకు ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఫిరోజ్ ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఇద్దరు జీఎస్టీ అధికారులు ఆనంద్ కుమార్, మనీష్ శర్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story