మూడో సారి అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ(Narendra modi) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకే(Jamili elections) మొగ్గుచూపింది

మూడో సారి అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ(Narendra modi) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకే(Jamili elections) మొగ్గుచూపింది. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌కు(One Nation One election) కేంద్ర కేబినెట్‌(Central cabinet) ఆమోదం తెలిపింది. రాంనాథ్‌ కోవింద్‌(Ramnath kovindh) కమిటీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్ర నిర్ణయించింది. అయితే గత రెండు దఫాలుగా సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి సంకీర్ణ భాగస్వాముల మద్దతుపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా జమిలిపై దూకుడుగానే వ్యవహరిస్తోంది. గత నెలలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం జమిలి ఎన్నికలు సాధ్యం కావని గట్టిగా వాదిస్తున్నాయి. కుట్రలో భాగంగానే ఈ జమిలీ ఎన్నికలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story