పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి ప్రకటించారు.

పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి(Hardeep Singh Puri) ప్రకటించారు. అవాస్తవాలు, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆయన సచించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ( హమాస్, హిజ్బుల్లా-ఇజ్రాయెల్ యుద్ధం) కారణంగా చమురు సరఫరాలో కొరత ఏర్పడి క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయని.. ఫలితంగా మరోసారి దేశంలో పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలు పెరుగుతాయని వార్తలచ్చిన నేపథ్యంలో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ స్పందించారు. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాలో ఎలాంటి కొరత మనకు లేదన్నారు. అవసరానికంటే ఎక్కువే అందుబాటులో ఉందని స్పష్టంచేశారు. బ్రెజిల్, గయానా వంటి దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా పెరిగిందని, రష్యా, ఇరాన్‌ నుంచి కూడా చమురు దిగుమతి చేసకుంటున్నామన్నారు. చమురు నిల్వలు అవసరానికి మించి ఉన్నాయని.. భవిష్యత్‌లో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందంన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story