Vizag Steel Plant Privatization : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనుకడుగు వేసిన కేంద్రం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు

vizag steel plant
విశాఖ(Vishaka) ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ(Privatization)పై కేంద్ర ప్రభుత్వం(Central government) వెనుకడుగు వేసింది. ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్(Faggan Singh) కలిస్తే స్పష్టం చేశారు. విశాఖ పర్యనటలో భాగంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్ఐఎన్ఎల్(RINL) ను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. స్టీల్ ప్లాంట్(Steel plant) మనుగడ కోసం ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యంతోనూ.. అలాగే కార్మిక సంఘాల నేతలతోనూ చర్చిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ బిడ్ లో పాల్గొనడం రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని కేంద్ర మంత్రి అన్నారు.
