✕
Chandrayaan 3 : చంద్రయాన్ 3 ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?
By EhatvPublished on 21 July 2023 5:47 AM GMT
జులై14 2023 మధ్యాహ్నం 2.35 నిముషాలకు చంద్రయాన్ 3 చంద్రుడి పైకి వెళ్లడం ప్రారంభించింది. చంద్రయాన్ 3 కి సంబందించిన లాంచింగ్, ల్యాండింగ్, దీని బడ్జెట్, ప్రయోగించబడ్డ మార్గం, అంతరిక్ష నౌక లో చేసిన మార్పులు లాంటి విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. జులై 14 2023 మధ్యాహ్నం 2.35 నిముషాలు భారతీయులందరు పిడికిళ్లు బిగించుకుని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం, సర్రిగ్గా ఇస్రో నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, భారతీయుల బాహుబలి రాకెట్ LBM 3M 4 చంద్రయాన్ 3 ని తీసుకుని నిప్పులు చిమ్ముకుంటూ చంద్రుడి వైపు దూసుకు పోయింది.

x
Chandrayaan 3
-
- జులై14 2023 మధ్యాహ్నం 2.35 నిముషాలకు చంద్రయాన్ 3 చంద్రుడి పైకి వెళ్లడం ప్రారంభించింది. చంద్రయాన్ 3 కి సంబందించిన లాంచింగ్, ల్యాండింగ్, దీని బడ్జెట్, ప్రయోగించబడ్డ మార్గం, అంతరిక్ష నౌక లో చేసిన మార్పులు లాంటి విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. జులై 14 2023 మధ్యాహ్నం 2.35 నిముషాలు భారతీయులందరు పిడికిళ్లు బిగించుకుని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం, సర్రిగ్గా ఇస్రో నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, భారతీయుల బాహుబలి రాకెట్ LBM 3M 4 చంద్రయాన్ 3 ని తీసుకుని నిప్పులు చిమ్ముకుంటూ చంద్రుడి వైపు దూసుకు పోయింది. ఒక్కసారిగా కోట్లాది భారతీయుల్లో ఆనందం, దేశం మొత్తం ఒక పండుగ వాతావరణం. ప్రపంచ దేశాల చూపుమొత్తం ఒక్క సారిగా మనదేశం వైపు తిప్పిన ఇస్రో పట్ల హర్షాతిరేకాలు, ఇది భారత్ కి మర్చిపోలేని క్షణం. అయితే చంద్రయాన్ 3 చంద్రుడి మీదకి చేరేవరకు ఎలాంటి మార్పులు ఉంటాయి, ఏమిజరుగుతుంది, చేరడానికి ఎంత సమయం పడుతుంది, చేరినతరవాత ఏంజరుగుతుంది లాంటి ఆసక్తి కరమైన అంశాలు ఇప్పడు చూద్దాం.
-
- వేగంగా దూసుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తులని, వాడు రాకెట్ సీడ్ లో దూసుకుపోతాడురా అంటారు. అంటే రాకెట్ కి ఉండే వేగం అలాంటిది కొన్ని వందల టన్నుల బరువుండే రాకెట్ ని రెప్పపాటులో నింగిలోకి తీసుకుపోవాలంటే దానికుండే వేగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగించినప్పటి వేగం గంటకు 1627 కిలోమీటర్లు. మెయిన్ రాకెట్ తో పాటు రెండు బూస్టర్ రాకెట్స్ కూడా నింగిలోకి వెళ్లాయి. సరిగ్గా రాకెట్ లంచ్ జరిగిన 108 సెకండ్స్ తరవాత 45 కిలోమీటర్ల ఎత్తులో లిక్విడ్ ఇంజిన్ స్టార్ట్ అయింది. దీంతో రాకెట్ వేగం గంటకు 1627 కిలోమీటర్లు నుంచి 6437 కిలోమీటర్లుకు పెరిగింది. 132 సెకండ్స్ తరవాత అంటే 62 కిలోమీటర్ల దగ్గర రెండు బూస్టర్ రాకెట్స్ మెయిన్ రాకెట్ నుంచి వేరు చేయబడింది. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, రాకెట్స్ ఎలా విడిపోతాయి? విడిపోయినతరవాత అవి ఎక్కడకి వెళ్తాయి అని. రాకెట్ కోసం రూపొందించిన ప్రత్యేక మైన సాఫ్ట్వేర్ సహాయంతో వీటిని విడకొట్టి భూమిపై సముద్రంలో పడేటట్టు చేస్తారు.
-
- ఇక్కడనుంచి మెయిన్ రాకెట్ పనితీరు మొదలవుతుంది. బూస్టర్ రాకెట్స్ విడిపోయినతరువాత మెయిన్ రాకెట్ స్పీడ్ గంటకు 6437 కిలోమీటర్లు నుంచి 7000 కిలో మీటర్లుగా మారింది. 192 సెకండ్స్ తరవాత 114 కిలోమీటర్ల దగ్గర రాకెట్ కి ముందు భాగంలో ఉండే రెండు హీట్ విండ్ షెడ్స్ కూడా వేరు చేయబడ్డాయి. అలా కొంత దూరం వెళ్ళినతరువాత 5 నిముషాల 32 సెకండ్స్ దగ్గర లిక్విడ్ ఇంజిన్ రాకెట్ నుంచి వేరు చేసారు. లిక్విడ్ ఇంజిన్ వేరు చేసినతరువాత రాకెట్ లోని క్రయోజెనిక్ ఇంజిన్ స్టార్ట్ అయింది. అక్కడనుంచి రాకెట్ గంటకు 36,968 కిలోమీటర్ల వేగంగా ఉంటుంది. ఈ వెంగంతో ఇంకొంత దూరం వెళ్ళినతరువాత క్రియోజనిక్ ఇంజిన్ కూడా చంద్రయాన్ 3 నుంచి విడిపోతుంది. రాకెట్ నుంచి విడిపోయిన చంద్రయాన్ 3 భూకక్ష్యలో తీరగడం స్టార్ట్ అవుతుంది. రాకెట్ ప్రయోగం జరిగిన 16 నిమషాలనుంచి చంద్రయాన్ 3 భూకక్ష్య లో తిరగడం జరుగుతుంది. అక్కడనుంచి చంద్రయాన్ 3 ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశింపచేసే ప్రక్రియ ని ఇస్రో శాస్త్రవేత్తలు మొదలుపెడతారు. మెల్లగా భూమి చుట్టూ తీరుగుతున్న చంద్రయాన్ రొటేషన్ని రోజురోజు కు డిస్టెన్స్ పెంచుతూ చంద్రుడి కక్షయలోకి ప్రవేశింపచేస్తారు. ఈ ఆర్బిటాల్ షేప్ గుండ్రంగా కాకుండా కోలగా కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ప్రస్తుతం అదే పని ఇస్రో సైంటిస్ట్స్ చేస్తున్నారు. చంద్రయాన్ 3 భూకక్ష్యలోంచి చంద్రకక్ష్య లోకి వెళ్ళడానికి సరిగ్గా 6 రోజుల సమయం పడుతుంది. అలా చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్న చంద్రయాన్ 3, 16 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో కోడిగుడ్డు ఆకారంలోతిరుగుతుంది, అలా తిరుగుతున్న దాన్ని నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం మీదకి దించుతారు శాస్త్రవేత్తలు.
-
- చంద్రయాన్ 3 మూడు వేరువేరు భాగాలుగా ఉంటుంది. మొదటిది ప్రొపల్షన్ మాడ్యూల్, దీని బరువు 2148 కేజీలు ఇది ఎగరడానికి పనిచేస్తుంది. రెండోది ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ ఇది ల్యాండ్ అవడానికి ఉపాయాగపడుతుంది. ఇక మూడోది అతిముఖ్యమైన రోవర్ దీని బరువు 1752 కేజీలు , ఇదే చంద్రుడిపై తిరుగుతూ అక్కడి సమాచారాన్ని, ఫోటోలని అందిస్తుంది. మొత్తం చంద్రయాన్ 3 రాకెట్ బరువు 4900 కేజీలు చంద్రయాన్ 3 చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నపుడు ల్యాండర్ ని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వేరు చేస్తారు. అలా వేరుపడ్డ ల్యాండర్ తన వేగాన్ని తగ్గించుకుని దాదాపు 40- 42 రోజుల తరవాత చంద్రుడి పై దక్షిణం ధ్రువంపై ల్యాండ్ అవుతాయి. చంద్రయాన్ 3 ఆగష్టు 23 సాయంత్రం 5. 47 కి చంద్రుడిపై ల్యాండ్ అయేలా ఇస్రో షెడ్యూల్ చేసింది. ల్యాండ్ అవడం అనేది చంద్రుడిపై సూర్యోదయం పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చంద్రుడిపై సూర్యోదయం ఆలస్యం అయితే సెప్టెంబర్ లో చంద్రయాన్ చంద్రుడి పైకి ల్యాండ్ చేస్తారు. చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండ్ అవడం చాలా కష్టమైన పని, ల్యాండింగ్ కి ముందు 15 నిముషాలు చాలా క్రుశ్యల్. అందుకే ఈ సారి ల్యాండ్ అవడానికి రెండు ప్లేసులు ఫిక్స్ చేసారు.
-
- చంద్రుడిపై చంద్రయాన్ 3 స్మూత్ గా ల్యాండ్ అయినతరువాత ఇస్రో లోని కమాండర్ రోవర్ ని చంద్రుడిపైకి దింపుతారు. అక్కడనుంచి రోవర్ తన పని ప్రారంభిస్తుంది. ఇస్రోల్యాండర్ కి విక్రమ్ అని రోవర్ కి ప్రజ్ఞన్ అనే పేర్లు పెట్టింది. ఈ మిషన్ లో భాగంగా ఇస్రో చంద్రుడిపై కెమికల్ ఎలెమెంట్స్ ఎలా ఉన్నాయ్, చంద్రుడి పై నీరు, నేల ఇతర సహజ వనరులు ఏమున్నాయి, ఎలాఉన్నాయి ఉన్నాయి అనే విషయాలపై ఇస్రో అధ్యయనం చేయనుంది. చంద్రయాన్ 3 లో సిసిమోమీటర్ ఏర్పాటు చేసారు. దీనితో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు ,వాతావరణం, ఉపరితల పర్యావరణం లాంటి ఎన్నో విషయాలని తెలుసుకోవచ్చు. రోవర్ కి సోలార్ పానెల్స్ అమర్చడం తో సూర్యకిరణాల ద్వారా వచ్చిన విద్యుత్ తో రోవర్ సెల్ఫ్ రీఛార్జ్ అవుతుంది. ఇది 14 రోజులపాటు పనిచేసేందుకు రోపొందించారు. అయితే అన్ని సక్రమంగా జరిగితే రోవర్ అంతకంటే ఎక్కువ రోజులు కూడా పని చేస్తుంది. ఇప్పటివరకు ప్రపంచంలో కేవలం రష్యా, అమెరికా ఇంకా చైనా మాత్రమే చంద్రుడి ఉపరితలం లోకి వ్యోమనవకల్ని పంపించగలిగారు, చంద్రయాన్ 3 సక్సెస్ అయితే ఆ మూడు దేశాల సరసన సాగరవంగా భారత్ తలెత్తుకుని నిలబడుతుంది. చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో మూడు ప్రధాన లక్ష్యాల్ని పెట్టుకుంది. అందులో మొదటిది రోవర్ ని చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ చేయడం, రెండోది చంద్రుడి ఉపరితలం పై రోవర్‌ని నడపడం ఇక మూడోది చంద్రుడిపై సైంటిఫిక్ రీసెర్చ్ చేయడం.
-
- ఇందిలో ఇప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కీలకం, చంద్రుడి పై కి రోవర్ స్మూత్ గా అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశంలో ఎలాంటి రాపిడి తగలకుండా ల్యాండ్ అవడమే సాఫ్ట్ ల్యాండింగ్. సర్రిగ్గా ఇక్కడే చంద్రయాన్ 2 విఫలమైంది. చంద్రుడికి 2 కిలోమీటర్ల దూరం లో ల్యాండ్ సమయానికి నిర్దేశించిన స్పీడ్ కంటే ఎక్కువుగా ఉండడంతో కక్ష్య దాటి వెళ్ళిపోయింది. సాఫ్ట్ లాండింగ్ కి బదులు కొన్ని సార్లు హార్డ్ ల్యాండింగ్ కి ట్రై చేస్తారు ఇందులో రోవర్‌ని ఒక బెలూన్ లాంటి దాంట్లో కప్పబడి చంద్రుడి ఉపరితలంపై ఎక్కడో ఒక చోట బలంగా ఢీ కొట్టి ల్యాండ్ అవుతుంది. అయితే ఇది చాలా సార్లు విఫలం అవుతుంది ఎందుకంటే ఉపరితలాన్ని గట్టిగా ఢీ కొట్టడంతో రోవర్ దాదాపుగా దెబ్బ తిని మిషన్ ఫెయిల్ అయేది. అందుకే టెక్నాలజీ డెవలప్ చేసి సాఫ్ట్ ల్యాండింగ్ కి ప్రాధాన్యత పెరిగింగి. చంద్రయాన్ 3 రెండో ప్రాధాన్యం రోవర్ ని చంద్రుడిపై నడపడం, ఒక సారి సాఫ్ట్ ల్యాండ్ అయిన తరవాత రోవర్ బైటకి వచ్చి చంద్రుడిపై మూవ్ అవడం దీనికోసం రోవర్ లో నావిగేషన్ కెమెరాలు, సోలార్ పానెల్స్, కమ్యూనికేషన్ కోసం యాంటెనాలు అమర్చిన దీని బరువు 27 కేజీలు. ఇది చంద్రుడిపై సమాచారాన్ని సేకరించి ల్యాండర్ కి అక్కడనుంచి ఆర్బిటర్ కి పంపుతుంది.
-
- ఆర్బిటర్ నేరుగా ఇస్రో సెంటర్ కి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇక మూడో ప్రాధాన్యత చంద్రుడి పై సైంటిఫిక్ స్టడీ. ల్యాండర్, రోవర్ చంద్రుడిపై డేటా ని సేకరిస్తాయి. చంద్రుడిపై వాతావరణం, ఉష్ణోగ్రత, చంద్రుడి ఉపరితలం పై వచ్చే కంపాలు, అక్కడి వాయువు, ప్లాస్మా ఇలా చాలా వాటికీ సంబందించిన డేటా కలెక్ట్ చేసి పంపుతుంది. ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి చంద్రయాన్ 3 ఉపయోగపడుతుంది. చంద్రయాన్ 3 ద్వారా వచ్చే డాటాతో, చంద్రుడి పైకి మానవాళిని పంపే అనేక ప్రాజెక్ట్స్ కి ఇస్రో ఈ డేటా అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఉపయోగిస్తుంది. చివరిగా ఇంత ఉపయోగకరమైన చంద్రయాన్ 3 కి ఖర్చుపెట్టిన బడ్జెట్ ఎంతో తెలిస్తే మనం అవాక్కవక మనం. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ కి అయిన ఖర్చు అక్షరాలా 615 కోట్లు, మన దేశంలో నిర్మిస్తున్న చాలా సినిమాలకంటే ఎంతో తక్కువ. అది మన ఇస్రో దాని సైంటిస్ట్ ప్రతిభ. ఆగష్టు 24 లేదా 25 న మన చంద్రయాన్ 3 సేఫ్ గా ల్యాండ్ అవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై భారత్

Ehatv
Next Story