ఆస్ట్రేలియాలో(Australia) ఓ సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌(Singh taxi driver) చరణ్‌జీత్‌ సింగ్‌ అత్వాల్(Charanjeet Singh Atwal) తన నిజాయితీని నిరూపించుకున్నాడు. తన కారులో ప్రయాణికులు వదిలి వెళ్లిన 8 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లను అంటే మన భారతీయ కరెన్సీలో 4.53 లక్షల రూపాయలను తిరిగి ఇచ్చేసి భారతీయుల నిజాయితీ ఏంటో చూపించాడు. పోలీసులకు సమాచారమిచ్చి 8 వేల ఆస్ట్రేలియన్ డాలర్లను తిరిగి ఇచ్చేశాడు.

ఆస్ట్రేలియాలో(Australia) ఓ సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌(Singh taxi driver) చరణ్‌జీత్‌ సింగ్‌ అత్వాల్(Charanjeet Singh Atwal) తన నిజాయితీని నిరూపించుకున్నాడు. తన కారులో ప్రయాణికులు వదిలి వెళ్లిన 8 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లను అంటే మన భారతీయ కరెన్సీలో 4.53 లక్షల రూపాయలను తిరిగి ఇచ్చేసి భారతీయుల నిజాయితీ ఏంటో చూపించాడు. పోలీసులకు సమాచారమిచ్చి 8 వేల ఆస్ట్రేలియన్ డాలర్లను తిరిగి ఇచ్చేశాడు. తాను 30 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని.. గతంలో కూడా అనేక సార్లు ఎంతో మంది నగదు, వస్తువులను తన ట్యాక్సీలో మర్చిపోయేవారని.. వాటిని వెంటనే వారికి తిరిగి ఇచ్చేసేవాడినని చెప్పాడు. తాజాగా ఓ ప్రయాణికుడు మర్చిపోయిన 8 వేల ఆస్ట్రేలియన్ డాలర్లను తిరిగి ఇచ్చేశానన్నారు. ప్రయాణికులు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును తానే ఉంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని ఆయన చెప్పారు. అయితే యజమాని నుంచి మీకు ఏదైనా బహుమతి వచ్చిందా అని అడిగితే.. చరణ్‌జీత్‌ సింగ్‌ అత్వాల్‌ సమాధానమిస్తూ తనకు ఎలాంటి బహుమతులు అవసరం లేదన్నారు. ఇదే విషయాన్ని చరణ్‌జీత్‌ సింగ్‌ ట్విట్టర్‌లో(Twitter) షేర్‌ చేయగా పలువురు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దేవుడి ఆశీర్వాదాలు చరణ్‌సింగ్‌పై ఉంటాయని.. ఇంతకంటే రెట్టింపు బహుమతి దేవుడు ఆతనికి బహుమతిగా ఇస్తారని కామెంట్లు చేస్తున్నారు.

Updated On 26 Dec 2023 4:33 AM GMT
Ehatv

Ehatv

Next Story