వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న కోపంతో భార్యను భర్త కొట్టి, గొంతునులిమి చంపేశాడు ఓ వ్యక్తి.

వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న కోపంతో భార్యను భర్త కొట్టి, గొంతునులిమి చంపేశాడు ఓ వ్యక్తి. చెన్నై (Chennai)సమీపంలోని పెరుంబాక్కం(Perumbakkam)లో ఉన్న హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న జాహీర్‌ హుస్సేన్‌ (Jahir Hussain)(39)కు సుప్రియ బేగం(Supriya Begum)(26) అనే భార్య ఉంది. వీరిద్దరూ వేర్వేరు ప్రైవేట్‌ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన జాహీర్‌ హుస్సేన్, సుప్రియా బేగంపై దాడి చేసి, గొంతు నులిమడడడంతో ఆమె స్పృహ తప్పింది. దీంతో వెంటనే ఆమెను రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, సుప్రియబేగం అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరుంబాక్కం పోలీసులు జాహీర్‌ హూస్సెన్‌ను అరెస్టు చేసి, విచారించారు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, మందలించినా కూడా వివాహేతర సంబంధాన్ని వదులకపోవడంతో ఆమెను కొట్టి చంపినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు.

ehatv

ehatv

Next Story