దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కాలుష్యం(Pollution) విపరీతంగా పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కాలుష్యం(Pollution) విపరీతంగా పెరిగింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగులబెట్డడంతో పాటు పొగ మంచు కమ్మేయడంతో కాలుష్యం రోజురోజుకీ పెరుగుతోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కాలుష్యం తగ్గడం లేదు. ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై కాలుష్యం పెను ప్రభావం చూపుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌(CJI chandrachood) కూడా వాయు కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం కారణంగా మార్నింగ్ వాక్‌కు(Morning veladam) వెళ్లడం మానేశానని చంద్రచూడ్‌ తెలిపారు. ఉదయంపూట బయటకు వెళ్లకపోవడమే మంచిదని డాక్టర్లు చేసిన సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఇంట్లో ఉంటే శ్యాసకోశ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకి ఢిల్లీలో గాలి నాణ్యత 283 ఉందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్ బోర్డు తెలిపింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story