ప్రవర్తన సరిగ్గా లేదని, నడవడికను మార్చుకోవాలని విద్యార్థికి చెప్పిన ప్రిన్సిపాల్ దారుణ హత్యకు గురయ్యారు.

ప్రవర్తన సరిగ్గా లేదని, నడవడికను మార్చుకోవాలని విద్యార్థికి చెప్పిన ప్రిన్సిపాల్ దారుణ హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌(MadhyaPradesh)లోని ఛతర్‌పూర్‌ జిల్లా(Chatarpur district)లో ఉన్న ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ దారుణమైన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి (17) ప్రవర్తన సరిగా లేకపోవడంతో ప్రిన్సిపాల్‌ ఎస్‌కే సక్సేనా( KS Saxena ) (55) మందలించారు. మంచి మాటలు చెప్పినా ఆ విద్యార్థి చెవికి ఎక్కించుకోలేదు. పైగా కోపం వచ్చేసింది. ఆ విద్యార్థి శుక్రవారం పాఠశాలకు రాలేదు. కానీ ప్రిన్సిపాల్‌ కదలికలను గమనిస్తూ, ఆ స్కూల్ దగ్గర దేశవాళీ తుపాకీతో ఆయన తలపై కాల్పులు జరిపాడు. దాంతో అక్కడికక్కడే కుప్పకూలి, ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్కూటర్‌పైనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో ఆ మైనర్‌ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story