National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి

యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఛార్జ్ షీట్‌లో ఈడీ పేర్కొంది. రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను ఛార్జ్ షీట్‌లో ఈడీ చేర్చింది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) కు చెందిన రూ.2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారని ఈడీ తెలిపింది. యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు 2019–22 మధ్యలో విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసి, పదవులు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న ఈడీ సాక్షులను విచారించిన తర్వాతనే రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్‌లో చేర్చామని, విచారణలో రేవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల సూచన మేరకే విరాళాలు ఇచ్చామని సాక్షులు తెలియజేశారని ఈడీ స్పష్టం చేసింది.
ఈ కేసు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి 2012లో దాఖలు చేసిన ఫిర్యాదు చేశారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (YIL) ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని, ఇది మోసం, నమ్మక ద్రోహం అని ఆరోపణలు ఉన్నాయి. AJL అనేది నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే సంస్థ, దీనికి సోనియా, రాహుల్ గాంధీలు యంగ్ ఇండియన్‌లో ప్రధాన వాటాదారులు.
ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రస్తావించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆదేశాల మేరకు యంగ్ ఇండియన్‌కు విరాళాలు సేకరించేందుకు పలువురిపై ఒత్తిడి తెచ్చారని ఈడీ ఆరోపించింది. ఈ విరాళాలు స్వచ్ఛందంగా కాకుండా, రాజకీయ ప్రయోజనాలు టికెట్లు, పదవులు ఆశ చూపి సేకరించినవని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అయితే, రేవంత్ రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదు, కేవలం విరాళాల సేకరణలో పాత్ర గురించి ప్రస్తావించింది.
