జమిలి ఎన్నికలకు(Jamili elections) కేంద్రం సర్వ సన్నద్ధమవుతోంది.

జమిలి ఎన్నికలకు(Jamili elections) కేంద్రం సర్వ సన్నద్ధమవుతోంది. వన్ నేషన్‌-వన్‌ ఎలెక్షన్‌కు(One nation One election) సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(Ramnath kovindh) రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. అయితే కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే(Mallikarjun kharge) విభేదించారు. ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పని చేయదని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామంటోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే దీనిపై హింట్‌ ఇచ్చారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story