కాంగ్రెస్‌పార్టీకి(Congress) హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana aasembly elections) ఫలితాలు మింగుడుపడటం లేదు

కాంగ్రెస్‌పార్టీకి(Congress) హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana aasembly elections) ఫలితాలు మింగుడుపడటం లేదు. అలా ఎలా ఓడిపోయి ఉంటామా అని మేథోమథనం చేసుకుంటోంది. ఈవీఎంల(EVM) వల్లే తాము ఓడిపోయామనే నిర్ధారణకు వచ్చింది. ఈవీఎంలలో గోల్‌మాల్‌ జరిగిందనే అనుమానాన్ని వ్యక్తపరుస్తూనే దాన్ని నిరూపించడానికి పూనుకుంది. వీవీ ప్యాట్లను(VV pats) లెక్కించాలని డిమాండ్‌ చేస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందిన వారంతా వీవీ ప్యాట్ల‌ పరిశీలనకు దరఖాస్తు చేయాలని హర్యానా కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఆదేశాలు ఇచ్చింది. వీవీ ప్యాట్ల లెక్కింపుల్లో తేడా వుంటుంద‌ని కాంగ్రెస్‌ బలంగా నమ్ముతోంది. అందుకే వీవీ ప్యాట్ల లెక్కింపునకు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేయాలని ఆదేశించింది. హర్యానా ఫలితాలు కాంగ్రెస్‌కే కాదు, దేశంలో ప్రతి రాజకీయపార్టీకి అనుమానం రేకెత్తించాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కూడా హర్యానా ఎన్నికలలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని నమ్ముతున్నారు. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలను జరపడం మంచిదని అంటున్నారు. ఇప్పుడు వీవీ ప్యాట్ల లెక్కింపులో ఏ మాత్రం తేడా వచ్చినా.. ఈవీఎంల వాడకంపై నీలి నీడలు కమ్ముకోవడం తథ్యం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story