శంషాబాద్ ఎయిర్ పోర్టులో(Shamshabad airport) కస్టమ్స్ అధికారుల(Customs officers) రూ. 12లక్షల విలువైన మద్యాన్ని(alcohol) పట్టుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో(Shamshabad airport) కస్టమ్స్ అధికారుల(Customs officers) రూ. 12లక్షల విలువైన మద్యాన్ని(alcohol) పట్టుకున్నారు. ఇటీవల 12 మంది గోవాకు(Goa) వెళ్లారు. అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాద్‌కు(Hyderabad) పెద్ద ఎత్తున నాన్ డ్యూటీ మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చారు. దీంతో వారిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారి లగేజీని చెక్ చేయగా 415 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారుగా రూ.12 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 415 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు .. 12 మంది నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి , డిసి రంగారెడ్డి దశరథ్, ఏసి ఆర్ కిషన్, ఏఈ ఎస్ జీవన్ కిరణ్ ఎన్ఫోర్స్‌మెంట్ టీములు రెండు, శంషాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీస్ టీమ్ కలిసి టీమ్స్ కలిసి ఈ రాకెట్ గుట్టును రట్టు చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story