ఇంతకంటే ఘోరం మరోటి ఉండదు. ప్రభుత్వాసుపత్రిలో(Government hospital) ఉన్న ఓ మృతదేహం(Dead body) కన్ను మాయమయ్యింది.

ఇంతకంటే ఘోరం మరోటి ఉండదు. ప్రభుత్వాసుపత్రిలో(Government hospital) ఉన్న ఓ మృతదేహం(Dead body) కన్ను మాయమయ్యింది. ఈ ఘటన బీహార్‌(Bihar) రాజధాని పాట్నాలో(Patna) చోటు చేసుకుంది. ఎలుకలు(Rats) కన్నును పెకిలించి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం సిబ్బందే ఈ పని చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన దుండగుల కాల్పులలో గాయపడిన ఫంతుష్‌ కుమార్‌ అనే వ్యక్తిని కుటుంబ సభ్యులు నలంద ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అదే రోజు రాత్రి అతడు చనిపోయాడు. తర్వాత మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. మరుసటి రోజు పోస్ట్ మార్టం కోసం తీసుకొచ్చినప్పుడు ఓ కన్నుమాయమైనట్టు గుర్తించారు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చురీ నుంచి మృతదేహాన్ని స్ట్రెచర్‌పై తెచ్చేటప్పుడు, ఎడమ కన్ను లేకపోవడాన్ని తాము గమనించామని, పక్కనే సర్జికల్‌ బ్లేడ్‌ కూడా ఉందని వారు ఆరోపిస్తున్నారు. వైద్యులు మాత్రం నెపాన్ని ఎలుకల మీద నెట్టేస్తున్నారు. ఎలుకలే కన్నును పెకిలించి ఉంటాయని చెబుతున్నారు. విధులలో నిర్లక్ష్యాన్ని కనబర్చిన ఇద్దరు నర్సులను అధికారులు సస్పెండ్‌ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story