ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా(Resign) చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం(Liqour Scam) అంటూ తప్పుడు కేసు సృష్టించి తనను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తన నిజాయితీని నిరూపించుకుంటానని కేజ్రీవాల్ అన్నారు. నా భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయిస్తారు. అగ్నిపరీక్షకు సిద్ధంగా ఉన్నానని.. నిర్దోషిగా నిరూపించుకునేంతవరకు పదవిలో ఉండనని సంచలన ప్రకటన చేశారు. మహారాష్ట్రతో పాటు నవంబర్‌లో ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story