నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది.

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈరోఉ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతర నిందితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణ కోసం నోటీసులు జారీ చేసింది. ఈడీ ఏప్రిల్ 9, 2025న దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సోనియా A 1, రాహుల్ A2గా చేర్చారు. కోర్టు ఈ కేసులో నిందితులకు రైట్ టు బి హియర్డ్ ఉందని, ముందు వారి వాదనలు వినాలని పేర్కొంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తులను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (YIL) ద్వారా సోనియా, రాహుల్ గాంధీలు రూ. 50 లక్షలకు తీసుకున్నారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ ఆస్తుల విలువ రూ. 2,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అంచనా వేసింది. రూ.900 కోట్ల ఆదాయమని.. ఇందులో రూ. 755 కోట్ల రియల్ ఎస్టేట్, రూ. 90 కోట్ల షేర్లు, రూ. 142 కోట్ల అద్దె ఆదాయం ఉన్నాయని ఈడీ తెలిపింది. ఈ ఆరోపణలు 2014లో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ఫిర్యాదుతో బయటపడ్డాయి. ఈడీ పత్రాల్లో కొన్ని లోపాలున్నాయని గతంలో దాఖలు చేసిన చార్జిషీట్‌పై వ్యాఖ్యానించగా తాజాగా ఈరోజు సవరించిన చార్జిషీట్‌ను వేశారు. కాంగ్రెస్ ఈ చర్యలను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దీనిని "ప్రధాని మోదీ రాజకీయ ప్రతీకారం"గా పేర్కొన్నారు. YIL ఒక లాభాపేక్షలేని సంస్థ అని, ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని కాంగ్రెస్ వాదిస్తోంది.
