అవును మీరు చదివింది నిజమే.

అవును మీరు చదివింది నిజమే. ఢిల్లీ కొత్త సీఎం(Delhi New Cm)గా బాధ్యతలు చేపట్టనున్న ఆతిశీ మార్లేనా సింగ్‌(Atishi Marlena Singh) మదనపల్లె(Madanapalle)లో టీచర్‌ బాధ్యతలు నిర్వర్తించారట. ఆతిశీ మార్లేనా సింగ్.. ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఢిల్లీకి సీఎం కానున్న ఆతిశీ.. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోనే కాదు ఏపీలోనూ ఆమె టీచర్‌గా పనిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలో ప్రఖ్యాత రిషీ వ్యాలీ స్కూల్(Rishi Valley School) పిల్లలకు ఆతిశీ పాఠాలు బోధించారట. ఇది కూడా సరిగ్గా 2013 సమయంలోనే కావడం విశేషం. ఎంతకాలం ప‌ని చేశార‌న‌ది తెలియరాలేదు.

Updated On
ehatv

ehatv

Next Story