✕
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు.

x
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ(Mandala Pooja) సీజన్, డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. రాబోయే రోజుల్లో రోజుకు లక్షకు పైగా భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

ehatv
Next Story