ఈనెల 16న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో(Chhatrapati Shivaji Maharaj International Airport) 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మృతుడికి సరైన సమయంలో వీల్ చైర్(Wheel chair) అందించలేదని ఎయిరిండియాకు(Air india) రూ.30 లక్షల జరిమానాను డీజీసీఏ విధించింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) త్వరితగతిన చర్య తీసుకుంది. ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎయిరిండియా వివరణ తర్వాత ఇండియాను దోషిగా నిర్ధారించి రూ.30 లక్షల జరిమానా విధించింది.

Airindia Airline

న్యూయార్క్(New york) నుంచి ముంబైకి వెళ్తున్న వ్యక్తి వీల్ చైర్‌లో ఉన్న తన భార్యతో కలిసి ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేయడానికి వెళ్తుండగా అనారోగ్యానికి గురయ్యారు. మృతుడికి వీల్‌చైర్ ఇవ్వకపోవడంతో నడుచుకుంటూ వెళ్లడంతోనే అనారోగ్యానికిగురై చనిపోయాడని ఎయిరిండియాపై ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారించిన డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, వికలాంగులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ఎయిర్ ఇండియా విఫలమైందని డీజీసీఏ అభిప్రాయపడింది. అన్ని విమానయాన సంస్థలకు కూడా డీజీసీఏ ఒక ఆర్డర్‌ను పంపింది. విమానం ఎక్కేటప్పుడు లేదా విమానం నుంచి దిగే సమయంలో సహాయం అవసరమయ్యే ప్రయాణీకులకు తగిన సంఖ్యలో వీల్‌చైర్లు ఉండేలా చూడవలసిన అవసరం ఉందని తెలిపింది.