మహిళలకు ఇంకా తప్పని వరకట్న వేధింపులు ఆగడం లేదు. కట్నం కోసం కోడళ్లను వేధించడం, హత్య చేయడం వంటి ఘటనలు ఎన్నో చూశాం.

మహిళలకు ఇంకా తప్పని వరకట్న వేధింపులు ఆగడం లేదు. కట్నం కోసం కోడళ్లను వేధించడం, హత్య చేయడం వంటి ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా కట్నం డబ్బుల కోసం కొత్త కోడల్ని తీవ్రంగా వేధించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కొత్త కోడలు అని కూడా చూడకుండా ఆమెను గదిలో బంధించి వేధించారు. అంతేకాదు విషపూరితమైన పామును వదిలారు అత్తామామలు. ప్రస్తుతం ఆమె కొన ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌నగరంలోని కల్నల్‌గంజ్‌లో ఈనె 18న ఈ దారుణం జరిగింది. బాధితురాలి చెల్లి రిజ్వానా ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి 19, 2021న షానవాజ్‌తో రేష్మ వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధం ఆమెకు పాము రూపంలో పెద్ద శాంపంగా మారింది. షాది జరిగిన కొన్ని రోజులకే అత్తింట్లో కష్టాలుమొదలైనాయి. వరకట్నం చెల్లించ లేదంటూ రేష్మను వేధించడం ప్రారంభించారు. ఆమెను తీవ్రంగా హింసించారు కూడా. ఆ రేష్మ పుట్టింటివారు రూ. 1.5 లక్షలు ఇచ్చారు. కానీ అదనంగా రూ. 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ వచ్చారు. అక్కడితో ఆగలేదు.ఆమెను ఎలాగైన వదిలిచుకోవాలనే పన్నాగంతో ఆమెను గదిలో బంధించారు. విషపూరితమైన సర్పాన్ని ఆమె గదిలో వదిలారు. అర్థరాత్రి, పాము రేష్మను కాటేసింది. నొప్పితో కేకలు వేసినా అత్తింటివారు పట్టించుకోలేదు. ఆమె పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు. చివరికి ఎలాగోలా విషయం తెలుసుకున్న ఆమె సోదరి జోక్యం చేసుకొని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. రిజ్వానా ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు షానవాజ్, అతని తల్లిదండ్రులు, అన్నయ్య, సోదరి, మరో ముగ్గురిపై హత్యాయత్నం, వరకట్నం తదితర కేసులు నమోదు చేశారు.
