హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana Assembly Elections) ఫలితాల తర్వాత చాలా మందికి ఈవీఎంల పనితీరుపై(EVM controversy) అనుమానాలు కలుగుతున్నాయి.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana Assembly Elections) ఫలితాల తర్వాత చాలా మందికి ఈవీఎంల పనితీరుపై(EVM controversy) అనుమానాలు కలుగుతున్నాయి. సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌(Exist Polls) కాంగ్రెస్ పార్టీనే(congress party) గెలుస్తుందని చెబితే, ఫలితాలు మాత్రం రివర్స్‌ అయ్యాయి. గెలిచే ఆశలేమీ పెట్టుకోని బీజేపీ విజయం సాధించింది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్‌ చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించడమే కాదు, వీవీ ప్యాట్లను లెక్కించాల్సిందేనంటూ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఈసీ రాజీవ్‌కుమార్‌ ఈ అంశంపై మాట్లాడారు. ఈవీఎంలపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌తో ఈసీకి సంబంధం ఉండదని, ఎగ్జిట్‌పోల్స్‌ ఆధారంగా ఈసీపై నిందలు వేయడం సరికాదని రాజీవ్‌కుమార్‌ అన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఇచ్చేవారు స్వీయ నియంత్రణ పాటించాలని ఈ సందర్భంగా ఆయన సలహా ఇచ్చారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story