బావ-మరదలు మధ్య వివాహేతర సంబందం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవతో మరదలు హత్య..!

బావ-మరదలు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కానీ కొన్నాళ్లయిన తర్వాత విషయం బయటకు పొక్కడంతో బావను మరదలు దూరం పెట్టసాగింది. అయినా తన కోరిక తీర్చాలంటూ మరదలు వెంట బావ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో మరదలిని చంపిన బావ, ఆ తర్వాత ట్రాక్టర్‌లో ఉన్న మట్టితో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌ సమీపంలోని ఓషా అల్లిపుత్తూర్‌కు చెందిన ప్రభు (40)-భార్య రాజేశ్వరి (30). వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రభు బెంగళూరులో భవన కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజేశ్వరి సోదరి మునియమ్మన్‌ భర్త హనుమంతన్‌ (40) కూడా భవన కాంట్రాక్టర్‌. ప్రభు, హనుమంతన్‌ ఇద్దరూ భాగస్వాములు. బెంగళూరులో నివసించే ప్రభు నెలలో ఒకటి, రెండుసార్లు స్వస్థలానికి వెళ్తాడు. ఈ నేపథ్యంలో రాజేశ్వరి, హనుమంత్‌న్‌ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరుగు పొరుగుకు విషయం తెలియడంతో హనుమంతన్‌ను రాజేశ్వరి దూరం పెట్టింది. అయినా హనుమంతన్‌ తన కోరికను తీర్చాలని ఆమె కోరడంతో నిరాకరించింది. ఈక్రమంలో రాజేశ్వరి శనివారం మధ్యాహ్నం కొడుకు చదువుతున్న పాఠశాలకు వెళ్లినప్పుడు, హనుమంతన్‌ ఆమెను అడ్డుకుని, చివరిసారిగా ఏకాంతంగా మాట్లాడడానికి పిలిచాడు. దీంతో, రాజేశ్వరి తన ఇంటికి సమీపంలోని తలవాయిఅల్లి ప్రాంతంలోని కల్లుకొల్లైమేడు ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఇద్దరూ గొడవ పడ్డారు. ఆగ్రహించిన హనుమంతన్‌ రాజేశ్వరిని సమీపంలోని గుంతలోకితోసి రాయితో కొట్టాడు. తర్వాత ట్రాక్టర్‌లోని మట్టిని ఆమెపై పడేశాడు. ఇదంతా సమీపంలోని పొలంలో పనిచేస్తున్న వ్యక్తులు ఇద్దరూ వాదించుకోవడం చూశారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హనుమంత్‌న్‌ను అరెస్టు చేయగా, రాజేశ్వరిని హత్య చేసి మట్టిలో పాతిపెట్టానని వెల్లడించాడు. పోలీసులు మట్టిని తవ్వి రాజేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసి హనుమంత్‌ను అరెస్టు చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story