తమ కొడుకు అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత, ఆ కుటుంబం ఇంటికి తిరిగి వచ్చారు.

తమ కొడుకు అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత, ఆ కుటుంబం ఇంటికి తిరిగి వచ్చారు. కానీ తమ కొడుకు సజీవంగా కనిపించాడు. దీంతో స్థానికులు, పోలీసులు కూడా షాక్ అయ్యారు. తమ కొడుకు అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత కుటుంబం తిరిగి వస్తుండగా. వారి ఇంటి ప్రాంగణంలో 'చనిపోయిన వ్యక్తి' నవ్వుతూ కూర్చుని ఉండటం వారు చూశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. చనిపోయినట్లు భావించిన యువకుడిని పూడ్చిపెట్టిన తర్వాత, కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి అక్కడ కూర్చున్న వ్యక్తిని చూశారు. ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్థానికులు కూడా ఆందోళన చెందారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఓ యువకుడి పేరు పురుషోత్తం, అతను సూరజ్‌పూర్‌లోని చంద్రాపూర్ నివాసి. గత శనివారం, మన్పూర్ ప్రాంతంలోని ఓ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. మృతుడి గుర్తింపును తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. పురుషోత్తం రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. అందువల్ల, మృతదేహం దొరికిందన్న వార్త అందిన వెంటనే కుటుంబసభ్యులు పరుగెత్తారు. కుటుంబసభ్యులు మృతదేహం పురుషోత్తందేనని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి పురుషోత్తం కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు. స్థానిక అధికారుల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి.
పురుషోత్తం కుటుంబం అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి తిరిగి రాగా.. పురుషోత్తం ఇంట్లో క్షేమంగా ఉన్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. పురుషోత్తం ఇంటి ముందు కూర్చుని ఉండటం చూశారు. దుఃఖంలో ఉన్న కుటుంబం ఆనందం, ఆశ్చర్యంతో నిండిపోయింది. ఈ వింత సంఘటన పురుషోత్తం కుటుంబానికి సంతోషకరమైన సందర్భం, కానీ పోలీసులకు ఇది ఒక రహస్యంగా మారింది. మృతుడి వివరాలు కనుగొనేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.


