దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. భారత్ బంద్‌లో భాగస్వాములు కావాలని

దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. భారత్ బంద్‌లో భాగస్వాములు కావాలని
నేడు భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చా సహా అనేక రైతు సంఘాలు, శుక్రవారం నాడు గ్రామీణ భారత్ బంద్‌కి పిలుపునిచ్చాయి. కేంద్రానికి వ్యతిరేకంగా రైతన్నలు చేపట్టిన నిరసనల్లో భాగంగా భారత్ బంద్‌ని సక్సెస్ చేయాలని రైతు సంఘాలు పిలుపును ఇచ్చాయి. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్రం దిగిరావాలని ఆందోళన చేస్తున్నారు. దేశ నలుమూలల్లోని రైతు సంఘాలు ఈ భారత్ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. భారత్ బంద్ ఉదయం 6 గంటలకు మొదలై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సహా వివిధ రైతు సంఘాలు ఫిబ్రవరి 16, శుక్రవారం.. కేంద్రం ముందు తమ డిమాండ్లను ఉంచాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. భారత్ బంద్‌లో భాగస్వాములు కావాలని, భావసారూప్యత కలిగిన రైతు సంఘాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని SKM అభ్యర్థించింది. హర్యానా, పంజాబ్ నుండి పాదయాత్రగా బయలుదేరిన వందలాది మంది రైతుల ‘ఢిల్లీ చలో’ నిరసనల మధ్య భారత్ బంద్ పిలుపు వచ్చింది. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాలా సమీపంలోని హర్యానా సరిహద్దుల వద్ద రైతులను ఆపివేశారు. రైతులను చెదరగొట్టేందుకు హర్యానా భద్రతా బలగాలు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించాయి.
