Father's negligence: తండ్రి నిర్లక్ష్యం.. ప్రాణాపాయంలో కూతురు..! స్కూటీని యాక్సిలటేర్‌ను తిప్పిన చిన్నారి..! గుంతలో పడి..!

ఓ తండ్రి నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాల మీదకు వచ్చింది. తన కూతురు కూర్చున్న స్కూటీని ఆన్‌లో పెట్టి ఇంటి గేటు తీయడానికి తండ్రి ప్రయత్నించాడు. స్కూటీ ఇంజిన్ ఆన్‌లో పెట్టి గేట్ తెరిచేలోపే స్కూటీ యాక్సిలరేటర్‌ని ఇవ్వడంతో అది కొంత దూరం ప్రయాణించి, ఓ గుంతలో పడింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో డాలి బాయ్ చౌరాహా వద్దనున్న ఓ స్కూల్ వద్ద ఘటన జరిగింది. తన పెద్ద కుమార్తెను స్కూల్ వద్ద డ్రాప్ చేయడానికి వచ్చాడు. స్కూటీ దిగి గేట్ వద్దకు వచ్చిన తండ్రి. స్కూటీ ఆన్‌లోనే ఉండటంతో.. బైక్‌పై ఉన్న చిన్న కుమార్తె యాక్సిలరేటర్‌ను తిప్పింది. దాంతో వేగంగా దూసుకెళ్తూ.. ఓ గుంతలో వాహనం దిగబడిపోయి, చిన్నారి ఎగిరిపడిపోయింది. దీంతో చిన్నారికి గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. సీసీటీవీలో దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


