భారత మాజీ క్రికెటర్(Former cricketer) సంజయ్ బంగర్(Sanjay Bangar) కుమారుడు ఆర్యన్(Aryan)..మహిళగా మారాడు

భారత మాజీ క్రికెటర్(Former cricketer) సంజయ్ బంగర్(Sanjay Bangar) కుమారుడు ఆర్యన్(Aryan)..మహిళగా మారాడు (మారింది). తన 10 నెలల హార్మోన్ల పరివర్తన ప్రయాణాన్ని వీడియోలో పంచుకున్నాడు. వీడియో సోషల్ మీడియాలో(Social media) వైరల్ అయ్యింది. అతను (ఆమె) భారత మాజీ కెప్టెన్లు ధోని(Dhoni), విరాట్ కోహ్లీ(Virat kohli), అతని తండ్రితో పాటు దిగిన ఫొటోలు కూడా పంచుకున్నాడు. శస్త్రచికిత్స జరిగిన 10 నెలల తర్వాత, ఆర్యన్‌ అనయగా మారినట్లు తెలిపాడు. ఆర్యన్ కూడా ఎడమచేతి వాటం బ్యాటర్‌. స్థానిక క్లబ్ క్రికెట్‌లో ఇస్లాం జింఖానా(Islam jinkhana) తరపున ఆడేవాడు. అతను లీసెస్టర్‌షైర్‌లోని హింక్లీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించి టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. ప్రస్తుతం, అనయ మాంచెస్టర్‌లో నివాసం ఉంటోంది. అక్కడి కౌంటీ క్లబ్‌లలో ఒకదానిలో ఆడుతోంది. ఆమె ఏ క్లబ్ కోసం ఆడుతుందో ఇంకా తెలియనప్పటికీ, ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లోని క్లిప్‌లో ఆమె ఒక మ్యాచ్‌లో 145 స్కోర్ చేసినట్లు చూపించింది. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) లింగమార్పిడి మహిళను మహిళల క్రికెట్ ఆడకుండా నిషేధించడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది

Updated On
Eha Tv

Eha Tv

Next Story