దేశంలో అపర కుబేరుడిగా అదానీ గ్రూప్‌ సంస్థల(Adani Group Industries) అధినేత గౌతం అదానీ(Adani) అవతరించారు. రిలయెన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్‌ అంబానీని(Mukesh ambani) అదానీ వెనక్కి నెట్టారు. స్టాక్‌మార్కెట్‌(Stock Market shares) అదానీ గ్రూప్‌కు సంబంధించిన షేర్లలో లాభాలు రావడంమే ఇందుకు కారణమని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నారు.

బ్లూమ్​బర్గ్​ బిలయనీర్స్ నివేదిక(Bloomberg Billionaires ) ప్రకారం గౌతం​ అదానీ(Gautham Adani) 97.6 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలో ప్రథమ స్థానంలో ఉండగా ప్రపంచంలోనే 12వ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 97 బిలియన్ డాలర్లుగా ఉండడంతో రెండో స్థానంలో నిలిచారు.
కొద్ది తేడాతో ఆయన రెండో స్థానానికి చేరారు. అదే సమయంలో ముకేశ్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు.

సరిగ్గా ఏడాది క్రితం 2023 జనవరిలో హిండెన్​బర్గ్ నివేదిక గౌతమ్ అదానీ సంస్థలపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్లలో అవకతవకలు జరిగాయని తెలిపింది. ఈ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత పుంజుకున్న అదానీ షేర్లు మళ్లీ లాభాలబాట పట్టాయి.

Updated On 5 Jan 2024 6:52 AM GMT
Ehatv

Ehatv

Next Story