ఓ ఉద్యోగికి(employee) ఇతర కంపెనీ నుంచి ఆఫర్‌(Offer) వచ్చింది.

ఓ ఉద్యోగికి(employee) ఇతర కంపెనీ నుంచి ఆఫర్‌(Offer) వచ్చింది. అతను ఆ ఉద్యోగానికి వెళ్లదల్చుకున్నాడు. నార్మల్‌గా అయితే ఫార్మాలిటీ ప్రకారం ఎవరైనా కూడా తమ రాజీనామా లేఖను హెచ్‌ఆర్‌కు(HR) అందిస్తూ ఈ సంస్థ నుంచి వెళ్లిపోవడానికి పలు కారణలు చెప్తారు. కానీ ఇక్కడ ఓ ఉద్యోగి మాత్రం వెరైటీగా రాజీనామా లేఖ రాశాడు. తనకు ఇతర కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, తాను కూడా అక్కడికి వెళ్లాలనుకుంటున్నానని.. కానీ అక్కడ వర్కవుట్‌ కాకుంటే మళ్లీ ఇక్కడికే వస్తానని చమత్కరిస్తూ రాశాడు. కంపెనీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలిపారు. “నేను ఒక కంపెనీ నుండి కొత్త ఉద్యోగం పొందా. నేను కూడా అక్కడికి వెళ్లి ప్రయత్నించాలనుకుంటున్నా. అక్కడ బాగా లేకుంటే నేను తిరిగి వస్తా. నేను నిర్వహణ బృందానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా, ముఖ్యంగా నప్పోకు కృతజ్ఞతలు అలాగే కంపెనీకి శుభాకాంక్షలు తెలుపుతున్నా" అంటూ రాజీనామాలేఖలో రాసుకొచ్చారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story