భరత్‌పూర్ నగరంలో ఒక వ్యక్తి తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో యువకుడిని యువతి చితకబాదింది.
![Girl Beats Up Eve Teaser : తనపై అసభ్య కామెంట్స్ చేసిన పోకిరీ చెంప చెళ్లుమనిపించిన యువతి.. వీడియో వైరల్ Girl Beats Up Eve Teaser : తనపై అసభ్య కామెంట్స్ చేసిన పోకిరీ చెంప చెళ్లుమనిపించిన యువతి.. వీడియో వైరల్](https://www.ehatv.com/h-upload/2025/01/11/740099-13.webp)
భరత్‌పూర్ నగరంలో ఒక వ్యక్తి తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో యువకుడిని యువతి చితకబాదింది. ధైర్యంగా ఆమె ఆ వ్యక్తిని ఎదుర్కొంది, ఆ మహిళ ఓ ప్రైవేట్ కంపెనీలో తన ఉద్యోగానికి నడుచుకుంటూ వెళ్తుండగా కేతన్ గేట్ దగ్గర ఆ వ్యక్తి ఎదురయ్యాడు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ సైకిల్‌పై వెళ్లాడు. ఆమె వెంటనే సంఘటన గురించి ఒక బైక్‌పై లిఫ్ట్ అడుక్కొని నేరస్థుడిని వెంబడించడించింది. ఆ వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, చివరికి గోవర్ధన్ గేట్ వద్ద బాటసారులు అతన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత యువతి ధైర్యంగా యువకుడి చెంప చెళ్లుమనిపించింది. దీంతో తనను క్షమించాలని ప్రాధేయపడ్డాడు. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయనని క్షమాపణ కోరాడు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వినియోగదారులు తమ మద్దతును తెలియజేశారు. అలాంటి వారికి ఇలానే బుద్ధి చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ధైర్యాన్ని కొనియాడారు. మహిళల పట్ల మరొకరు అలాంటి వ్యాఖ్యలు చేస్తే ధైర్యంగా ఎదర్కొని నిందితుడికి బుద్ధి చెప్పిందని యువతిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
![ehatv ehatv](/images/authorplaceholder.jpg?type=1&v=2)