జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం ముఖ్యంగా ఓయో హోటల్స్ వినియోగదారులైన ప్రేమ జంటలు, కొత్తగా పెళ్లైన వారు, ఫ్యామిలీలు అందరికీ ఇది గుడ్ న్యూస్. 2025 సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తున్నందున, రాబోయే పండుగ సీజన్‌లో టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా హోటల్ పరిశ్రమపై దృష్టి సారించి, గదులపై విధించే పన్నును తగ్గించింది. దీని వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా హోటళ్లలో గదులు మరింత చౌకగా మారనున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకునే లవర్స్, పెళ్లి కాని జంటలు, పెళ్లైన జంటలు అందరికీ ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. గతంలో హోటల్ గదులపై నాలుగు రకాలు GST రేట్లు ఉండేవి. ముఖ్యంగా చిన్న బడ్జెట్ ఉన్న వారికి ఇది భారంగా మారేది. ఇప్పుడు GST కౌన్సిల్ ఆ నాలుగు స్లాబ్‌లను రద్దు చేసి, రెండు జీఎస్టీలకు మాత్రమే కుదించింది. రూ.7,500 లోపు గదులకు 5% , రూ.7,500 పైబడిన గదులకు 12% పన్ను విధించనున్నారు. అంటే చౌకా హోటళ్లలో బస చేసినా, ఖరీదైన హోటళ్లలో గది బుక్ చేసుకున్నాఅందరికీ ప్రయోజనం కలగనుంది.
ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె. శ్యామా రాజు హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం వల్ల భారతీయ హోటళ్లలో దేశీయ పర్యాటకులు మాత్రమే కాకుండా, విదేశీ ప్రయాణికులను కూడా ఆకర్షిస్తాయన్నారు. ఇది పర్యాటక రంగానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఓయో హోటల్స్ వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్‌లు పెద్ద ఎత్తున లాభపడనున్నాయి. ఇప్పటికే యువత, లవర్స్, పెళ్లి కాని జంటలు, కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువగా ఓయో హోటల్స్‌నే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు GST తగ్గింపుతో ఈ ధరలు మరింత తగ్గనున్నాయి. అంటే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసినా, వర్క్ ట్రావెల్‌లోనూ, వీకెండ్ గెటవేలోనూ ఖర్చు తగ్గి సౌకర్యం పెరుగుతుంది. ఇంతకు ముందు పరిస్థితి భారంగా ఉండేది. రూ.2,500 నుంచి రూ.7,499 వరకు గదులపై 18% పన్ను ఉండేది, రూ.7,500 పైబడితే 28% పన్ను విధించబడేది. ఇప్పుడు 18% మరియు 28% భారం తగ్గి, రెండు స్లాబ్‌లు మాత్రమే మిగిలాయి.
