టెలి కమ్యూనికేషన్స్ విభాగం (DTO) మొబైల్ వినియోగదారులకు వాట్సాప్‌లో + 92 తో మొదలయ్యే విదేశీ నంబర్ల నుంచి వచ్చే కాల్స్(Whatsapp) పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ దుండగులు +92 నెంబర్‌తో స్టార్ట్ అయ్యే నెంబర్ల నుంచి కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు గుర్తించింది.

Fraud Whatsapp Calls
టెలి కమ్యూనికేషన్స్ విభాగం (DTO) మొబైల్ వినియోగదారులకు వాట్సాప్‌లో + 92 తో మొదలయ్యే విదేశీ నంబర్ల నుంచి వచ్చే కాల్స్(Whatsapp) పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ దుండగులు +92 నెంబర్‌తో స్టార్ట్ అయ్యే నెంబర్ల నుంచి కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు గుర్తించింది. ఈ తరహ నెంబర్స్ నుంచి ఫోన్స్ వస్తే ఎలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని వినియోగదారులకు సూచించింది. సైబర్ నేరగాళ్లు సైబర్-క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు వ్యక్తిగత సమాచారాన్ని బెదిరించేందుకు/దొంగిలించడానికి ఇలాంటి కాల్‌ల ద్వారా ప్రయత్నిస్తున్నారని టెలి కమ్యూనకేషన్స్ విభాగం తెలిపింది. ముఖ్యంగా ఫోన్స్ ద్వారా ఏ చట్టబద్ధ సంస్థ అయినా వ్యక్తిగత వివరాలను అడగదని అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ముఖ్యంగా +92 అంటే పాకిస్తాన్ కోడ్ ప్రారంభమయ్యే ఈ నెంబర్‌ల నుంచి సైబర్ మోసగాళ్లు జనాలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సంచార్ సాథి పోర్టల్‌లో రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్స్ సౌకర్యం ద్వారా ఇలాంటి మోసపూరిత కాల్ లను చెప్పాల్సిందిగా డీఓటీ ప్రజలను కోరింది.
