సరస్వతీ నిలయమైన స్కూళ్లో(School) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు(Govt Teacher) అసభ్యంగా ప్రవర్తించాడు.

సరస్వతీ నిలయమైన స్కూళ్లో(School) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు(Govt Teacher) అసభ్యంగా ప్రవర్తించాడు. తోటి ఉపాధ్యాయురాలి పట్ల నీచంగా మాట్లాడాడు. ఆమె హాజరుకు సంబంధించిన విషయాన్ని అడ్డం పెట్టుకుని ముద్దులు అడిగాడు. ఓ ఉపాధ్యాయురాలి అటెండెన్స్‌ వేయించుకునేందుకు ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లింది. అయితే ఆ ఉపాధ్యాయుడి కోరిన కోరిక తీర్చాలని అడిగాడు. నీకు అటెండెన్స్‌ వేయాలంటే తనకు 'ముద్దు'(Kiss) ఇవ్వాలని ఉపాధ్యాయురాలిని కోరాడు. ఉత్తర్ ప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్రంలో టీచర్స్ అటెండెన్స్ కోసం తెచ్చిన డిజిటల్ హాజరు వ్యవస్థను(Digital attandence system) అడ్డం పెట్టుకొని ఓ ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయురాలిని ముద్దు పెట్టమని అడిగాడు. ముద్దు పెడితేనే హాజరు వేస్తానని చెప్పాడు. అతడి వేషాలు.. వేధింపులను బాధిత ఉపాధ్యాయురాలు వీడియో తీసి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈసందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడుతూ 'నీ హాజరు వేయాలంటే నాది ఒక షరతు ఉంది. చాలా సరదాగా ఉంటుంది. చాలా ఈజీ పని' అని ఆ టీచర్‌ చెప్తాడు. అందుకు ఆమె 'ఏమిటా షరతు' అని ఉపాధ్యాయురాలు అడగ్గా.. ఈ ఉపాధ్యాయుడు సిగ్గులొలుకుతూ.. అబ్బో మురిసిపోతూ.. బుగ్గను చూపిస్తూ 'ముద్దు కావాలి' అని అడిగాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ తిన్న ఆ టీచర్‌ అందుకు అంగీకరించలేదు. 'నీ కండిషన్‌కు నేను అంగీకరించను. ఇది చాలా నీచమైన పని' అంటూ బదులిచ్చింది. ఇదంతా టీచర్‌ తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడంతో అతగాడి బాగోతం బయటపడింది. ఉపాధ్యాయుడి నీచపు బుద్ధిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story