కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్ గవర్నర్ డాక్టర్ సివి ఆనంద్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్ గవర్నర్ డాక్టర్ సివి ఆనంద్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్‌జి కార్‌ ఆసుపత్రిలో ఏం జరిగినా.. అది చాలా కలకలం రేపుతోంది. ఈ ఘటనతో యావత్ దేశ ప్రజలు నిరాశకు గురై, ఆగ్రహంతో ఉన్నారని గవర్నర్ అన్నారు. కోల్‌కతా పోలీసుల పాత్రను ప్ర‌స్తావిస్తూ.. సాక్ష్యాలను తారుమారు చేయడానికి లేదా నాశనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని అన్నారు. ఆత్మహత్య అనే భావన కల్పించేందుకు.. ఉద్దేశపూర్వకంగానే తమను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని కూడా ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై గవర్నర్ ఆనంద్ బోస్ తన స్పందనను తెలియజేసారు. డిమాండ్‌ అనేది డిమాండ్‌.. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.. గవర్నర్‌గా ఇలాంటి విషయాలపై నేను అప్రమత్తంగా ఉండాలనుకుంటున్నాను. రాజ్యాంగంలో చాలా ఆప్షన్‌లు ఉన్నాయి.. ఈ సమయంలో నా ఆప్షన్‌లను రిజర్వ్‌ చేస్తున్నాను.. బహిరంగంగా "భారత రాజ్యాంగం ప్రకారం నేను తరువాత ఏమి చేయబోతున్నాను? అనే విషయం చెప్పను అన్నారు.

ఈ కేసును పోలీసు అధికారులు చాలా నీచంగా పరిష్కరించారని అన్నారు. ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉంది. దుండగులు ఆస్ప‌త్రిలో విధ్వంసం చేసిన ఘటన తర్వాత నేను ఘటనా స్థలానికి (ఆర్‌జీ కర్ హాస్పిటల్) వెళ్లానని గవర్నర్ చెప్పారు. ప్రజలు కేవలం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం సమాజం వారితో (బాధితులు, ఆందోళనకారులు) ఉంది. మేము వారికి న్యాయం చేయాలన్నారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story