చెప్పులేసుకుని గుళ్లోకి వెళ్లకూడదు. అది ఆలయ నిబంధన! ఎంత పెద్ద హోదాలో ఉన్నవారైనా సరే, చెప్పులిప్పేసే గుళ్లోకి వెళ్లాలి.

చెప్పులేసుకుని గుళ్లోకి వెళ్లకూడదు. అది ఆలయ నిబంధన! ఎంత పెద్ద హోదాలో ఉన్నవారైనా సరే, చెప్పులిప్పేసే గుళ్లోకి వెళ్లాలి. కానీ ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని మీర్జాపూర్‌(Mirjapur) జిల్లాలో అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (Agriculture) ప్రతీక్‌ కుమార్‌(Prateek Kumar) బూట్లు వేసుకుని విద్యవాసిని(Vindhyavasini temple) అమ్మవారి ఆలయంలోకి వెళ్లాడు. ఆయన తీరును చూసి భక్తులు ఆందోళన చెందారు. ఏడీఓ బూట్లు వేసుకుని ఉండటాన్ని చూసి ఎమ్మెల్యే రత్నాకర్‌ మిశ్రా మండిపడ్డారు. విషయం తెలుసుకున్న జిల్లా మెజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్‌(Priyanka Niranjan) సదరు ఏడీఓ(ADO)ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదేశించారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు ప్రతీక్‌కుమార్‌ సింగ్‌ను తక్షణమే సస్పెండ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు

Updated On
ehatv

ehatv

Next Story