5, 18 శాతం శ్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. 12, 28 శాతం శ్లాబ్‌లు తొలగించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.

5, 18 శాతం శ్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. 12, 28 శాతం శ్లాబ్‌లు తొలగించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. జీఎస్టీ కొత్త శ్లాబ్‌లు ఈ నెల 22 నుంచి అమలు కానున్నాయి. బీమా ప్రీమియంలు, పలు ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించారు. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి సున్నాకు తగ్గించారు. మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిళ్లు, షార్ప్‌నర్స్‌పై జీఎస్టీ మినహాయింపు. నోట్‌బుక్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, ఎరేజర్స్‌పై జీఎస్టీ సున్నాకు కుదించారు. రోటీ, పరోటాలపై జీఎస్టీ సున్నా. ఇంట్లో నిత్యం వాడే వస్తువులపై 5 శాతం జీఎస్టీ.. శ్లాబ్‌ల మార్పు వల్ల రూ.48 వేల కోట్ల మేర ఆదాయం కోల్పోనున్న ప్రభుత్వం. వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జీఎస్టీ 18 శాతం నుంచి సున్నాకు తగ్గించారు.క్రేయాన్స్, ప్యాస్టెల్స్‌పై జీఎస్టీ 12 శాతం నుంచి సున్నాకు తగ్గింపు. ఎరేజర్స్‌పై జీఎస్టీ 5 శాతం నుంచి సున్నాకు తగ్గింపు.
