పర్యాటకులకు(Tourists) గుజరాత్‌(Gujarat) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అరేబియా సముద్రంలో(Arebian Sea) మునిగిపోయిన సుందరమైన ద్వారకా(Dwaraka) నగరాన్ని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. మహాభారత(Mahabharatha) కాలంలో శ్రీకృష్ణ భగవానుడు(Sri Khrishna) నిర్మించిన సుందరమైన ద్వారకా నగరాన్ని చూసేందుకు జలాంతర్గాముల్లో తీసుకెళ్లనున్నట్లు తెలిపింది

పర్యాటకులకు(Tourists) గుజరాత్‌(Gujarat) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అరేబియా సముద్రంలో(Arebian Sea) మునిగిపోయిన సుందరమైన ద్వారకా(Dwaraka) నగరాన్ని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. మహాభారత(Mahabharatha) కాలంలో శ్రీకృష్ణ భగవానుడు(Sri Khrishna) నిర్మించిన సుందరమైన ద్వారకా నగరాన్ని చూసేందుకు జలాంతర్గాముల్లో తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ద్వారకా నగరం కట్టడాలు, పురాతన ఆలయాలను చూసేందుకు సబ్‌మెరైన్లను(Submarines) ఏర్పాటు చేయనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. రెండు గంటల పాటు దర్శన యాత్రను నిర్వహిస్తామని.. ఇందుకోసం షిప్‌యార్డుకు కంపెనీ 'మజ్‌ గావ్‌ డాక్'(Maj Gao Doc) తో గుజరాత్‌ పర్యాటకశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు గంటల పాటు సముద్రంలో పయనించి ఆనాటి ద్వారకాను చూసే అవకాశం కల్పించనున్నారు. ట్రిప్‌కు 24 మంది పర్యాటకులకు అనుమతి ఉంటుందని తెలిపింది. అయితే జలాంతర్గాముల్లో పర్యాటకులను తీసుకెళ్లడం దేశంలోనే తొలిసారి అవుతుందని గుజరాత్‌ ప్రభుత్వం వెల్లడించింది.

Updated On 28 Dec 2023 8:06 AM GMT
Ehatv

Ehatv

Next Story