ప్రియుడితో కలిసి కారులో వెళ్తున్న భార్యను భర్త చూశాడు. ఆ కారును అడ్డుకుని ఆపేందుకు ప్రయత్నించాడు.

ప్రియుడితో కలిసి కారులో వెళ్తున్న భార్యను భర్త చూశాడు. ఆ కారును అడ్డుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడ్ని కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు వారు ప్రయత్నించారు. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని గ్వాలియర్‌(Gwalior)లో ఈ సంఘటన జరిగింది. అనిల్‌ పాల్‌కు రజనీతో తొమ్మిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అనిల్ తన సొంత ఇంటిలోనే స్టేషనరీ షాప్‌ పెట్టుకున్నాడు. భర్త అనిల్‌తో భార్య తరుచుగా గొడవపడేది. అయితే రజినీకి మంగళ్‌ సింగ్‌(Mangal Singh Kushwah) అనే వ్యక్తితో పెళ్లి కంటే ముందు నుంచే సంబంధం ఉందని అనిల్ అనుమానించాడు. అయితే ఓ రోజు కడుపు నొప్పిగా ఉందని ఆస్పత్రికి వెళ్తున్నానని భర్తకు చెప్పి ప్రియుడి దగ్గరికి వెళ్లింది. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆమె కోసం భర్త వెతకసాగాడు. ఈ క్రమంలో ఓ కారులో తన భార్య ఉండడాన్నిచూశాడు. దగ్గరికి వెళ్లి చూడగా ప్రియుడు కుష్వా కూడా ఉన్నాడు. ఆ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కారును ఆపకుండా అతడిని ఢీకొట్టారు ఈ గాఢ ప్రేమికులు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌ను హాస్పిటల్‌కు తరలించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుగా పొలీసులు తొలుత భావించారు. కోలుకున్న తర్వాత అనిల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. ప్రియుడితో కలిసి భార్య రజనీ తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలు పూర్తిగా పరిశీలించి భార్య రజీనిని, మంగళ్ సింగ్‌ కుష్వాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story