హిమాచల్‌ ప్రదేశ్‌లో(Himachal Pradesh) ఉన్న కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో(Himachal Pradesh) ఉన్న కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక కష్టాల నుంచి బయటపడేందుకు నియంత్రిత పద్దతిలో గంజాయి సాగు(Cannabis Cultivation) చేసేందుకు అనుమతి ఇవ్వాలని అనుకుంటోంది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. చిత్రమేమిటంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతిపక్ష బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం! రాష్ట్రంలో గంజాయి సాగుకు గత ఏడాది అసెంబ్లీలో(Assembly) చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగత్‌సింగ్‌ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్‌ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని ఆ కమిటీ పేర్కొంది. గంజాయి సాగు పెద్ద కష్టమైనదేమీ కాదు కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని జగత్‌సింగ్‌ నేగి చెప్పారు. తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్‌ నిబంధనలను(ఎన్‌డీపీఎస్‌ చట్టం) సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్టు తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story