రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా కేంద్రంలోని కోకాపేట భూములకు వేలంలో రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే. దీంతో అదే తరహాలో బుద్వేల్(Budvel) భూముల అమ్మకానికి ఈ-వేలం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Budvel Land Auctions Notifications
రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా కేంద్రంలోని కోకాపేట భూములకు వేలంలో రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే. దీంతో అదే తరహాలో బుద్వేల్(Budvel) భూముల అమ్మకానికి ఈ-వేలం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా విక్రయించనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
బుద్వేల్‌లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి ఉంచినట్లు పేర్కొంది. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. ఎకరాకు రూ.20 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. 6న ప్రీబిడ్ సమావేశం.. 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 10న ఈ -వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
