ఓ యువతి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే వివరాల తనిఖీ కోసం యువతి ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

ఓ యువతి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే వివరాల తనిఖీ కోసం యువతి ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరు(Bengaluru) నగరంలోని బ్యాటరాయనపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపూజీ నగరలో ఉండే ఓ యువతి విదేశాల్లో చదవాలనుకుంది. ఇందుకోసం పాస్‌పోర్టు(Passport)కు దరఖాస్తు చేసుకుంది. ఆమె గురించి తనిఖీ చేయాలని పాస్‌పోర్టు ఆఫీసు నుంచి పోలీస్ స్టేషన్‌కు సిఫారసు వచ్చింది. దీంతో కానిస్టేబుల్‌ కిరణ్‌(Conistable Kiran) యువతి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి చొరబడి తలుపులు మూసి, మీ సోదరునిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని దీంతో నీకు పాస్‌పోర్టు రాదు. నీవు నాకు సహకరిస్తే చాలు అని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో ఒక్కసారి కౌగిలించుకుంటా అని వేధించాడని యువతి ఆరోపించింది. మరో గదిలో ఉన్న సోదరుడు వీరి మధ్య జరిగిన గొడవ విని కానిస్టేబుల్‌ మాట మార్చి అక్కడి నుంచి జారుకున్నాడు. మరోవైపు వెరిఫికేషన్‌ నంబర్‌ ఇవ్వకుండా బ్లాక్‌ చేశాడు. దాంతో బాధితురాలు పశ్చిమ డీసీపీ ఎస్‌. గిరీష్‌ని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటూ అతన్ని సస్పెండ్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story