భారీ వర్షాల కారణంగా కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.

భారీ వర్షాల కారణంగా కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో 100 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకోగా.. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మరణించినట్లు జిల్లా అధికారి ధృవీకరించారు.

ప్రభావిత ప్రాంతంలో అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను మోహరించినట్లు కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) తెలిపింది. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి చెందిన అదనపు బృందం వాయనాడ్‌కు వెళుతోంది. CMO ప్రకారం.. ఆరోగ్య శాఖ - జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లు 9656938689, 8086010833లను సంప్ర‌దించాల‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు MI-17, ALH సూలూర్ నుండి ఉదయం 7.30 గంటలకు బయలుదేరాయి. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story