ఒక వ్యక్తి మద్యానికి, జూదానికి బానిస అయ్యాడు. మద్యం, జూదం ఆడుతూ ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు.

ఒక వ్యక్తి మద్యానికి, జూదానికి బానిస అయ్యాడు. మద్యం, జూదం ఆడుతూ ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఏకంగా తన భార్యనే తాకట్టుపెట్టాడు. తన స్నేహితులతో జూదం( gambling)ఆడుతూ తన భార్యను పణంగా పెట్టి, ఆమెపై లైంగిక వేధింపులకు ఉసిగొల్పాడు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని రాంపూర్‌(RamPuram)లోని షహబాద్ పోలీస్ స్టేషన్(Shahabad Police Station)ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు 2013 లో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం కోసం వేధించసాగారు. వ్యసనాలకు అలవాటుపడ్డ కొడుక్కు అత్తింటివారు మద్దతు తెలిపారు. జూదం ఆడుతూ భార్యను కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు భర్త. దీంతో పుట్టింటికి మహిళ వెళ్లిపోయింది. అక్కడికి కూడా స్నేహితులతో కలిసి వెళ్లి బాధితురాలిపై దాడి చేశాడు. అతని స్నేహితులు తన వేలు విరిచి బయటకు లాగడానికి ప్రయత్నించారు. అతని స్నేహితులు తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేశారు రాంపూర్‌ పోలీసులు. కోర్టులోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని మహిళ తెలిపింది.

Updated On
ehatv

ehatv

Next Story