అయోధ్య వివాహిత తన ప్రియుడితో కలిసి రాసలీలల్లో మునిగి ఉండగా మామకు అడ్డంగా దొరికింది.

వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, భర్తలకు లేదా అత్తింటివారికి దొరికిపోవడం చాలా సందర్భాల్లో చూస్తాం. అయోధ్య వివాహిత తన ప్రియుడితో కలిసి రాసలీలల్లో మునిగి ఉండగా మామకు అడ్డంగా దొరికింది. అయోధ్యలోని పురాకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బభన్‌గవా గ్రామంలో జరిగినట్లు తెలిసింది. ఓ మహిళకు పెళ్లయి అత్తారింట్లో ఉంటోంది. భర్త విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లాడు. తరుచుగా కలుసుకునే ప్రియురాలు, ప్రియుడు అదును చూసి ఓరోజు ఆమెను కలిసేందుకు వెళ్లాడు. కుటుంబ సభ్యుల కంటపడకుండా తప్పించుకుని, ప్రియుడు నేరుగా మహిళ గదిలోకి వెళ్లి, తాను అందరినీ తప్పించుకోగలిగానని అనుకున్నాడు. ఆ తర్వాత ప్రియురాలితో రాసలీలల్లో మునిగిపోయాడు. ఇంతలో మామకు మెలుకవ వచ్చింది. కోడలి గది నుంచి శబ్దాలు, గుసగుసలు వినపడుతున్నాయి. ఇతర కుటుంబసభ్యులను పిలిపించి లోపలి నుంచి వచ్చే శబ్దాలను వినిపించాడు. మరోవైపు ఎవరైనా దొంగతనం చేయడానికి తన కోడలి గదిలోకి దూరారేమో అని భావించారు. గ్రామస్తులను పిలిపించి తలుపులు తీసి వెతకగా.. మంచం లోపల దాచుకున్నాడు. కానీ కోడలు అదరలేదు, బెదరలేదు. తను నా ప్రియుడు అని వారించింది. ప్రియుడిని చితకబాదుదామని మామ వెళ్తుంటే అడుక్కుని బతిమలాడుకుంది. అతడిని కొట్టకూడదని అడ్డుపడింది. పైగా తమ విషయం తన భర్తకు ఎప్పుడో తెలుసు అని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. చేసేదేమీ లేక మామ పోలీసులకు సమాచారం అందించగా, వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విదేశాల్లో ఉంటున్న భర్తకు ఫోన్ చేయగా, వీరి వ్యవహారం తనకు తెలుసని పోలీసులతో చెప్పాడు.ఆ తర్వాత, కుటుంబ సభ్యులు మరియు పోలీసుల సమక్షంలో, ఆ ఇద్దరికీ వివాహం జరిపించారు.


