సాధారణంగా భార్య అందంగా ఉంటే..భర్త మురిసిపోతూ ఉంటాడు. ఇలాంటి అందమైన భార్య తనకు దొరకడం తన అదృష్టం అని ఫీలవుతూ ఉంటాడు.

సాధారణంగా భార్య అందంగా ఉంటే..భర్త మురిసిపోతూ ఉంటాడు. ఇలాంటి అందమైన భార్య తనకు దొరకడం తన అదృష్టం అని ఫీలవుతూ ఉంటాడు. ఆమెపై ఎనలేని ప్రేమను చూపిస్తాడు. ఆమెకు ఏది కావాలంటే అది కొనిస్తాడు. బాధపెట్టకుండా తన భార్యను అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. కానీ ఇక్కడో భర్త మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నాడు. తన భార్య అందంగా ఉందని దారుణానికి తెగబడ్డాడు. అతడు చేసిన పనికి ఊరు ఊరంతా ఒక్కసారిగా అవాక్కైంది. ఇలా చేశాడేంట్రా బాబు అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. మరికొందరైతే ఛీ ఛీ అంటూ అతడిపై దుమ్మెత్తిపోశారు. ఇంతకీ అతడు ఏం చేశాడు. పశ్చిమ బెంగాల్(West Bengal) - నదియా జిల్లా శాంతీపుర్ పీఎస్ పరిధిలోని బేర్పారాలో భార్య మధు ఖాతూన్(Madhu Khathun) ముక్కు కొరికేసిన భర్త బాపన్ షేక్(Bapan Shaik). నీ ముక్కు అందంగా ఉంది.అవకాశం దొరికితే కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పని చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య మధు ఖాతూన్
