నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతున్న IC 814: ది కాందహార్ హైజాక్ (The Kandahar Hijack)వెబ్‌ సిరీస్‌పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతున్న IC 814: ది కాందహార్ హైజాక్ (The Kandahar Hijack)వెబ్‌ సిరీస్‌పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో అయిదుగురు హైజాకర్లలో ఇద్దరికి హిందూ పేర్లు ఉండటంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం చెందుతున్నాయి. ఉగ్రవాదులకు భోలా, శంకర్‌ అని పిలవడంపై మండిపడుతున్నారు. బాయ్‌కాట్ బాలీవుడ్‌(Boycott bollywood) అని ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కంటెంట్‌ చీఫ్‌ మోనికా షెర్గిల్‌కు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్‌ 3 తేదీలోపు వెబ్‌ సిరీస్‌లోని వివాదాస్పద అంశాల గురించి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లయిట్‌ ఐసీ 814ను పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హర్కత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ హైజాక్‌ చేసిన సంఘటన ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో ఇద్దరు హైజాకర్లను హిందూ కోడ్‌నేమ్స్‌తో పిలవడమే వివాదానికి కారణమయ్యింది.

Updated On
ehatv

ehatv

Next Story