టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా(Sania Mirza) తరచూ వార్తల్లో ఉంటారు.

టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా(Sania Mirza) తరచూ వార్తల్లో ఉంటారు. ఈ మధ్యనే భర్త షోయబ్‌ మాలిక్‌కు(shoib Malik) విడాకులు(divorce) ఇచ్చారు సానియా! అప్పట్నుంచి సానియా మీర్జాపై బోల్డన్ని కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ అయిన షోయబ్‌ మాలిక మూడో పెళ్లి చేసుకుని చక్కగా ఉన్నప్పుడు సానియా మీర్జా మాత్రం మరో పెళ్లి ఎందుకు చేసుకోకూడదని నెటిజన్లు చాలా మంది అడుగుతున్నారు. ఈ క్రమంలో భారత క్రికెటర్‌ మహ్మద్‌ షమీతో(Mohammad shami) సానియా పెళ్లి కాబోతున్నదనే కథనాలు కూడా వచ్చాయి. షమీ కూడా తన భార్యకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సానియా, షమీ పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా రియాక్టయ్యారు. అవన్నీ చెత్త వార్తలని, ఇప్పటి వరకు షమీని సానియా కలవలేదని ఇమ్రాన్‌ మీర్జా క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అయిన సానియా మీర్జా హజ్‌ యాత్రకు వెళ్లారు. తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఇంట్రెస్టింగ్‌ పోస్టు పెట్టారు. తాను మారుతున్నానని, ఏమైనాతప్పులు ఉంటే క్షమించాలని దేవుడిని ప్రార్థించారు సానియా. తన ప్రార్థనలను అల్లా ఆలకిస్తాడనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. తాను అదృష్ట‌వంతురాలిని, కృత‌జ్ఞ‌తభావంతో మెసులుకుంటానని సానియా తెలిపారు. ప‌విత్ర యాత్ర చేప‌డుతున్న సంద‌ర్భంగా త‌న‌ను గుర్తుంచుకోవాల‌ని, ఒక మంచి మనిషిలా తాను తిరిగి వ‌స్తాన‌ని సానియా తన పోస్టులో పేర్కొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story