మే 1, 2025 నుంచి భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో పలు ముఖ్యమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి.

మే 1, 2025 నుంచి భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో పలు ముఖ్యమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఈ మార్పులు ప్రయాణికుల సౌకర్యం, టికెట్ బుకింగ్ పారదర్శకత, దుర్వినియోగాన్ని నివారించడం కోసం రూపొందించబడ్డాయి.
వెయిటింగ్ టికెట్లపై కఠిన నిబంధనలు
స్లీపర్ మరియు ఏసీ కోచ్‌లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో ప్రయాణించడానికి అనుమతి ఉండదు. వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులు జనరల్ కోచ్‌లలో మాత్రమే ప్రయాణించగలరు. ఈ నియమం రద్దీని తగ్గించడం, రిజర్వ్‌డ్ సీట్లకు అనుకూలంగా ఉండడానికి తీసుకున్నారు.
అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ తగ్గింపు:
టికెట్ బుకింగ్ కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించబడింది. అయితే, కొన్ని ప్రత్యేక రైళ్లు (తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటివి), విదేశీ పర్యాటకుల కోసం 365 రోజుల నియమం మారదు. ఈ మార్పు టికెట్ రద్దులను తగ్గించడం, నిజమైన ప్రయాణికులకు సీట్ల లభ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
OTP ఆధారిత వెరిఫికేషన్ (OTP Verification):
IRCTC పోర్టల్ లేదా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసేటప్పుడు OTP ఆధారిత మొబైల్ నంబర్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇది నిజమైన ప్రయాణికులు మాత్రమే టికెట్లు బుక్ చేసేలా చేయడానికి, ఏజెంట్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఉద్దేశించబడింది.
రీఫండ్ ప్రక్రియలో మెరుగుదల (Refund Process):
టికెట్ రద్దు చేసినప్పుడు రీఫండ్ ప్రక్రియ సమయం 5-7 రోజుల నుంచి 48 గంటలకు తగ్గించబడింది. ఇది ఆన్‌లైన్ , కౌంటర్ బుకింగ్‌లకు వర్తిస్తుంది, బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన రద్దులకు వేగవంతమైన సేవను అందిస్తుంది.
తత్కాల్ టికెట్ నిబంధనలు (Tatkal Tickets):
తత్కాల్ టికెట్ల కోసం ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తప్పనిసరి చేయబడింది. డైనమిక్ ప్రైసింగ్ మోడల్ ప్రవేశపెట్టబడింది, దీని ప్రకారం డిమాండ్, బుకింగ్ సమయం ఆధారంగా ఛార్జీలు మారవచ్చు. రీఫండ్ నిబంధనలు కఠినతరం చేయబడ్డాయి, మహిళలు మరియు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కోటాలు ప్రవేశపెట్టబడ్డాయి. టికెట్ బుకింగ్ సమయంలో మోసాలను నివారించడానికి డబుల్ SMS వెరిఫికేషన్ విధానం అమలులోకి వస్తుంది. పేపర్ టికెట్ల వినియోగాన్ని తగ్గించడానికి ప్రయాణికులను సాఫ్ట్ కాపీలను ఉపయోగించాలిని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు.వెయిటింగ్ టికెట్లతో ప్రయాణించే వారు జనరల్ కోచ్‌లను ఎంచుకోవాలి లేదా కన్ఫర్మ్‌డ్ టికెట్‌లను పొందేలా ప్లాన్ చేయాలి.
