ఇండిగో వివాదం కారణంగా గడిచిన రెండు మూడు రోజుల్లోనే లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇండిగో వివాదం కారణంగా గడిచిన రెండు మూడు రోజుల్లోనే లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అనేకమంది తమ షెడ్యూల్‌ను పోస్టు పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా భారత దేశ పరువు తీసిన ఘటన ఇది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ఏవియేషన్ రంగంలో ఈ స్థాయిలో అప్రతిష్ట, ఈ స్థాయిలో అవమానం భారతదేశానికి ఎప్పుడూ జరగలేదు. మోదీ సర్కారు నేతృత్వంలో భారతదేశం పరువు అంతర్జాతీయంగా పూర్తిగా పోయింది. ఈ మొత్తం పోయిన పరువుకి కారణం ఇండిగో అనే సంస్థ పేరుతో ఇండిగో పైన నెపం వేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.
ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలలో భారీ అంతరాయం ఏర్పడి, గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది విమానాలు రద్దు కావడం మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆశ్చర్యకరంగా, ఇది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ పాత్ర కూడా వివాదంగా మారింది. రిపబ్లిక్ టీవీ ఇండిగో సంక్షోభంపై హై-వోల్టేజ్ చర్చను ప్రసారం చేసింది, దీనికి ఛానల్ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి మోడరేట్ చేశారు. ఈ చర్చలో టిడిపి తరపున మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత చైర్మన్ దీపక్ రెడ్డి పాల్గొన్నారు. చర్చ సందర్భంగా, అర్నాబ్ గోస్వామి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర దాడి చేశారు, ఇది ప్రయాణీకుల భద్రతతో కూడిన సమస్య అని, ఇండిగో ఎయిర్‌లైన్స్ బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోయిందని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సిబ్బంది రోస్టరింగ్ కోసం విమాన డ్యూటీ సమయ పరిమితులు నిబంధనలను అమలు చేయడానికి రెండేళ్ల సమయం ఇచ్చినప్పటికీ, కేంద్రం మళ్ళీ విమానయాన సంస్థ ఒత్తిడితో నిబంధనలను సవరించిందని ఆయన ఆరోపించారు.
చర్చలో భాగంగా అర్నగ్ గోస్వామి దీపక్‌రెడ్డిని మాట్లాడాలని సూచించగా.. దీపక్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ "పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ఇందుకోసం "అత్యవసర వార్ రూమ్" ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. దీంతో లోకేష్ ఏ అధికారంతో జాతీయ విమానయాన సంక్షోభాన్ని పర్యవేక్షిస్తున్నారని పదే పదే అడిగారు. "ఒక రాష్ట్ర మంత్రి దేశవ్యాప్తంగా పౌర విమానయాన సమస్యను ఎలా పర్యవేక్షించగలరు? ఇక్కడ అతని అధికారిక పాత్ర ఏమిటి? అతను కేంద్ర పౌర విమానయాన మంత్రి కాదు," అని అర్నాబ్ ఎదురుదాడి చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని మరియు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 24x7 అత్యవసర వార్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అర్నబ్ మాట్లాడుతూ పౌర విమానయాన మంత్రి ఎక్కడా కనిపించడం లేదు బాధ్యత ఆయనదే, పర్యవేక్షణ ఆయనదే, అది మోడీ ప్రభుత్వానిదే. ప్రయాణీకులకు ఉపశమనం లేదు. జవాబుదారీతనం లేదని.. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 క్రాష్ తర్వాత కూడా ఏవియేషన్‌పై చర్యలు లేవన్నారు. గతంలో పలువురు మంత్రులను ఆ శాఖ నుంచి తప్పించారని, కానీ ఇక్కడ అలాంటి చర్యలు ఏవీ తీసుకొలేదని అర్నబ్ ప్రశ్నించారు. మీ పార్టీకి దీనికి ఏంటి సంబంధం, ఇది కేంద్ర ప్రభుత్వ విమానయాన విషయమా, ఇది టీడీపీ నడిపే యంత్రాంగమా అని దీపక్‌రెడ్డిని అర్నబ్ ప్రశ్నించారు. సంక్షోభానికి గల కారణాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఇండిగో ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ, అది దాని సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని దీపక్‌రెడ్డి అనగా.. పాలక వర్గంలో భాగమైన పార్టీ నుంచి ఇటువంటి ప్రకటనలు రావడం తగదని అర్నాబ్ సూచించారు.
మరోవైపు టీడీపీ మంత్రిని, లోకేష్‌ను అర్నబ్ ఎండగట్టడంపై వైసీపీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయి. జాతీయస్థాయిలో కూడా లోకేష్‌కు భజన చేయాలని టీడీపీ చూస్తే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయని వైసీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు


